Wednesday, November 21, 2007

ఎవరునువ్వు?


ఎవరునువ్వు?


ఎవరునువ్వు?

ఇలా ఎపుడుమారావు?

నేనే గుర్తించలేనంతగా

నీకు నువ్వే నచ్చలేనంతగా

ఇలా ఎపుడు మారావు?


వ్యక్తిత్వం వదిలి

అస్తిత్వం మరచి

వట్టి మెదడుతో

అలా ఎలాబ్రతికేస్తున్నావు?


మిధ్యాలోకం లో మిద్దెలు కడుతూ

మురిసిపోతున్నావా?

పేకమేడలెపుడన్నా చూసావా?

నీటి రాతలెపుడన్నా రాసావా?

వాటి అనందం ఎంత సేపు?

నీకుతెలీదా?


ఇప్పటికన్నా చెప్పు

మనిషిలా ఎపుడు మారతావు?

నీలా నువ్వు మళ్ళా ఎప్పుడు పుడతావు?

No comments: